Share News

కరుణ కుమార్‌ ఆశయానికి ‘ఊపిరి’!

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:15 AM

తన మరణానంతరం అవయవాలను దానం చేయాలని చెప్పిన ఆయన ఆశయాన్ని అలాగే నెరవేర్చారు కుటుంబ సభ్యులు.

కరుణ కుమార్‌ ఆశయానికి ‘ఊపిరి’!

  • చనిపోతూ ముగ్గురికి అవయవదానం

పెనమలూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తన మరణానంతరం అవయవాలను దానం చేయాలని చెప్పిన ఆయన ఆశయాన్ని అలాగే నెరవేర్చారు కుటుంబ సభ్యులు. తాను మరణించి, మరికొందరికి జీవితాన్ని ఇచ్చిన ఆయన పలువురికి ఆదర్శంగా నిలిచారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడుకు చెందిన కాసరనేని కరుణకుమార్‌(63) ఈనెల 26న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మెదడులో రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం పోరంకి క్యాపిటల్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.

ఆయన ప్రాణాలను కాపాడేందుకు అక్కడి వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోగా బ్రెయిన్‌ డెడ్‌ అయింది. ఈ క్రమంలో అవయవదానం చేయాలనే కరుణ కుమార్‌ కోరికను కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం జీవన్‌దాన్‌ స్వచ్ఛంద సంస్థ ఏపీ విభాగం ప్రతినిధులకు సమాచారం అందించి, వారి సమన్వయంతో కరుణకుమార్‌ అవయవాలను సేకరించారు.

అవసరమైన ఆసుపత్రులకు గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా తరలించి రెండు కిడ్నీలను ఇద్దరికి, లివర్‌ను మరొకరికి అమర్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండీ మన్నె హరీష్‌ మాట్లాడుతూ మరణానంతరం తమ అవయవాలను దానం చేయడం అత్యుత్తమ దానంగా అభివర్ణించారు. జీవన్‌దాన్‌ ఏపీ విభాగం చైర్మన్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌, డాక్టర్‌ మన్మధరావు, ఆసుపత్రి వైద్య బృందం కరుణకుమార్‌ కుటుంబ సభ్యులను, బంధువులను అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 05:18 AM