Share News

లక్షల కొద్దీ దొంగ నోట్ల కలకలం.. పోలీస్ రైడ్‌తో గుట్టు రట్టు..

ABN , Publish Date - Feb 04 , 2026 | 07:27 PM

కృష్ణా జిల్లాలో దొంగ నోట్లు ముద్రిస్తూ గుట్టు చప్పుడు కాకుండా చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నచిన్న వ్యాపారులను టార్గెట్ చేసుకుని ఈ ముఠా యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

లక్షల కొద్దీ దొంగ నోట్ల కలకలం.. పోలీస్ రైడ్‌తో గుట్టు రట్టు..
Fake currency racket Krishna district,

కృష్ణా జిల్లా: కృత్తివెన్ను మండలం సంగమూడిలో నకిలీ నోట్ల చెలామణి చర్చనీయాంశంగా మారింది. సంగమూడిలో ఓ మద్యం దుకాణం దగ్గరికి వెళ్లిన ఓ వ్యక్తి.. తనకు నచ్చిన బ్రాండ్ కొన్నాడు. అందు కోసం షాపు నిర్వాహకుడికి కొంత డబ్బు చెల్లించాడు. అయితే, అది ఫేక్ నోటు అని మద్యం షాపు నిర్వాహకులు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రంజిత్ సింగ్, బ్రహ్మ ఉమాశంకర్, దిలీప్ గా గుర్తించారు. వీరి నుంచి సుమారు రూ.6లక్షల విలువైన దొంగ నోట్లతోపాటు ప్రింటింగ్ మిషన్, పేపర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ నకిలీ నోట్ల దందా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెడుతున్నా దొంగనోట్ల ముఠాలు మాత్రం రెచ్చిపోతున్నాయి. సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, నకిలీ కరెన్సీని మార్కెట్ లో యథేచ్ఛగా చెలామణి చేస్తూ ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి.


Also Read:

బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..

ఎమ్మెల్యే సంజయ్‌కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్

Updated Date - Feb 04 , 2026 | 07:52 PM