అనంతలో సర్పంచ్ పీఠం 29 లక్షలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:55 AM
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ సర్పంచ్ పీఠం రూ.29 లక్షలు పలికింది.
గార్లదిన్నె, పార్వతీపురం రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ సర్పంచ్ పీఠం రూ.29 లక్షలు పలికింది. గ్రామంలో రామాలయం నిర్మాణానికి ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికి సర్పంచి పదవిని ఏకగ్రీవం చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీనికి రెండు ప్రధాన పార్టీల నాయకులు అంగీకరించడంతో రెండురోజుల కిందట వేలం నిర్వహించారు. ఎల్‌ఐసీ ఆదినారాయణ రూ.29 లక్షలకు పాడటంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్థులు నిర్ణయించారు. అలాగే, పార్వతీపురం మండలంలోని పుట్టూరు సర్పంచ్ పదవిని టీడీపీ మద్దతుదారు రూ.13 లక్షలకు దక్కించుకున్నారు. కవిటిభద్రలో సర్పంచ్ పదవి రూ.12 లక్షలకు ఏకగ్రీవమైంది.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం