14 వేల కోట్లతో ‘కియా’ విస్తరణ!
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:46 AM
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ రంగ దిగ్గజ సంస్థ.. ‘కియా’ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.
విశాఖ పెట్టుబడుల సదస్సులో ఎంవోయూ కుదుర్చుకోనున్న సంస్థ
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ రంగ దిగ్గజ సంస్థ.. ‘కియా’ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా యూనిట్‌ను మరింత బలోపేతం చేసేందుకు, విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.
ఈ కథనం మేరకు.. కియా మరో 1.5 బిలియన్ డాలర్లు(రూ.14,167 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రస్తుతం జరుగుతున్న 3 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షలకు పెంచాలని సంస్థ నిర్ణయించింది. విశాఖపట్నంలో త్వరలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో ఈ విషయంపై ప్రకటన చేయడంతోపాటు ఎంవోయూ కుదుర్చుకునే అవకాశం ఉందని ఆంగ్ల పత్రిక తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు