ఐఐటీ తిరుపతిలో 25 కోట్ల పెట్టుబడి.. కియా ఇండియా చీఫ్ ఏవో టిహ్యూన్ కిమ్ ప్రకటన
ABN , Publish Date - Aug 08 , 2026 | 06:59 AM
‘ఐఐటీ తిరుపతిలో కియ ఇండియా ప్రారంభించిన ‘ఇన్‌స్పైర్ వర్క్స్ మేకర్స్ ల్యాబ్’ ఒక ప్రయోగశాల కాదు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆవిష్కరణ. వచ్చే ఐదేళ్లలో ఐఐటీ తిరుపతిలో రూ.25 కోట్ల పెట్టుబడులు పెడతాం’ అని కియ ఇండియా చీఫ్ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ టిహ్యూన్ కిమ్ అన్నారు.
హిందూపురం, (ఆంధ్రజ్యోతి): ‘ఐఐటీ తిరుపతిలో కియ ఇండియా ప్రారంభించిన ‘ఇన్‌స్పైర్ వర్క్స్ మేకర్స్ ల్యాబ్’ ఒక ప్రయోగశాల కాదు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆవిష్కరణ. వచ్చే ఐదేళ్లలో ఐఐటీ తిరుపతిలో రూ.25 కోట్ల పెట్టుబడులు పెడతాం’ అని కియ ఇండియా చీఫ్ అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ టిహ్యూన్ కిమ్ అన్నారు. ఐఐటీ తిరుపతిలో ఏర్పాటు చేసిన ఇన్‌స్పైర్ వర్క్స్ మేకర్స్ ల్యాబ్‌ను కళాశాల ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. తిరుపతి ఐఐటీ-కియ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యంతో కీలక మైలురాయిని అధిగమించామని వెల్లడించారు.
ఈ రెండు సంస్థల మధ్య గతేడాది మే 9న అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరిందని, ఏడాదికిపైగా సాగిన ప్రయాణంలో ఇన్‌స్పైర్ వర్క్స్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఐఐటీ తిరుపతిలో రూ.25 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. అందులో భాగంగానే ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల స్కాలర్‌షి్‌పలు, రిసెర్చ్, అభివృద్ధికి ఈ నిధులు కేటాయిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి...
ఐఏఎస్ సందీప్ కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రెండో రోజుకు ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ.. ఐఫోన్‌పై లోతుగా దర్యాప్తు
Read Latest Telangana News And Telugu News