Share News

ఫ్యామిలీ అంతా స్కూటర్‌పై వచ్చి..

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:38 AM

ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన సాధారణ గృహిణి, బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన కరిష్మా సుల్తానా కడప కార్పొరేషన్‌ 31వ వార్డుకు శనివారం నామినేషన్‌ వేశారు.

ఫ్యామిలీ అంతా స్కూటర్‌పై వచ్చి..

కడపలో స్వతంత్ర అభ్యర్థిగా మహిళ నామినేషన్‌

కడప కలెక్టరేట్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన సాధారణ గృహిణి, బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన కరిష్మా సుల్తానా కడప కార్పొరేషన్‌ 31వ వార్డుకు శనివారం నామినేషన్‌ వేశారు. 55వ డివిజన్‌ రవీంద్రనగర్‌కు చెందిన ఆమె.. తన భర్త, ముగ్గురు సంతానం, చెల్లెలితో కలసి స్కూటర్‌పై కలెక్టరేట్‌కు వచ్చారు. గేటు వద్ద వారిని ఆపిన పోలీసులు.. ఏ పనిపై వచ్చారని ప్రశ్నించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వచ్చామని చెప్పగానే పోలీసులు ఆశ్చర్యపోయారు. లోపలికి అభ్యర్థితో పాటు, ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో పిల్లలను మహిళా పోలీసులు వద్ద వదిలి కరిష్మా సుల్తానా నామినేషన్‌ వేసి వచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:38 AM