మహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:09 AM
శరన్నవరాత్రుల్లో ఏడో రోజైన శనివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో భక్తులు పోటెత్తారు.
అమ్మవారి సేవలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, విజయ్ దేవరకొండ దంపతులు
విజయవాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రుల్లో ఏడో రోజైన శనివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో భక్తులు పోటెత్తారు. సాయంత్రం 4.30 గంటల సమయానికి 76,846 మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. 1,89,609 లడ్డూలను విక్రయించారు. 15,171 మంది అన్నప్రసాదం స్వీకరించారు. అమ్మవారిని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు, సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు దర్శించుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ