రోడ్డు వేస్తేనే.. ఓటేస్తాం
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:42 AM
రోడ్డు వేసే వరకు ఓటు వేయబోమని కాకినాడ జిల్లాలో నిరసనకు దిగారు. తమ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ ఎన్నికలను బహిష్కరిస్తామని కాజులూరు మండలం ఆర్యవటం శివారు తుమ్మలపల్లిలంక గ్రామస్థులు అల్టిమేటం జారీచేశారు.
అప్పటి వరకు ఎన్నికల బహిష్కరణ
కాజులూరు(కరప), అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రోడ్డు వేసే వరకు ఓటు వేయబోమని కాకినాడ జిల్లాలో నిరసనకు దిగారు. తమ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ ఎన్నికలను బహిష్కరిస్తామని కాజులూరు మండలం ఆర్యవటం శివారు తుమ్మలపల్లిలంక గ్రామస్థులు అల్టిమేటం జారీచేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు దూరమంటూ ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ఆదివారం గ్రామంలో ఆందోళన చేపట్టారు. తుమ్మలపల్లిలంక గ్రామానికి ఉన్న ఏకైక రహదారిని రాజకీయ కక్షలతో ఎక్స్‌కవేటర్‌తో తవ్వేశారని, దీంతో శెట్టిబలిజ కులస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు గ్రామానికి చేరుకోలేకపోతున్నాయని, ఎవరైనా చనిపోతే పాడె మోయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా కలెక్టర్, అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. రహదారి సౌకర్యం కల్పించాలని, రోడ్డును తవ్వేసి నానా ఇబ్బందులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ఏ ఎన్నికలు వచ్చినా బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం