జమ్మలమడుగు బీజేపీలో రాజీనామాల ప్రకంపనలు.. ఇద్దరు జడ్పీటీసీల రాజీనామా
ABN , Publish Date - Nov 20 , 2026 | 02:42 PM
కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీలో రాజీనామాల కలకలం రేగింది. జడ్పీటీసీ పదవికి చదిపిరాళ్ల రాజేష్‌రెడ్డి రాజీనామా చేశారు. అలాగే ముద్దునూరు మండల జడ్పీటీసీ పదవికీ గోవర్దన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు.
కడప, నవంబర్20: జిల్లాలోని జమ్మలమడుగు బీజేపీలో రాజీనామాల కలకలం రేగింది. జడ్పీటీసీ పదవికి చదిపిరాళ్ల రాజేష్‌రెడ్డి రాజీనామా చేశారు. అలాగే ఆయన సోదరుడు ముద్దునూరు మండల జడ్పీటీసీ పదవికీ గోవర్దన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. కడప జడ్పీ చైర్మన్ స్థానం టీడీపీకి దక్కడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జడ్పీ చైర్మన్ పదవిని రాజేష్ రెడ్డి ఆశించారు. కానీ పొత్తులో భాగంగా రాష్ట్రంలో బీజేపీకి ఒకే ఒక్క జడ్పీ స్థానాన్ని కృష్ణాజిల్లాకు కేటాయించిన సంగతి తెలిసిందే.
నా నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తా: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
కడప జడ్పీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయింపుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధిష్ఠానంతో ఈ రోజు సాయంత్రం చర్చిస్తానని తెలిపారు. తన నిర్ణయాన్ని శనివారం ప్రకటిస్తానని వెల్లడించారు. జమ్మలమడుగులో 46కి 46 స్థానాలు గెలిచామని చెప్పారు. అయితే రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే.. తనకు అర సెకన్ కూడా పట్టదని అన్నారు. కూటమి కోసం నిబద్ధతతో పని చేశానని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ మాకు ప్రధాన శత్రువు.. బీజేపీ పోటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ
For More AP News And Telugu News