ఓసీ సీటులో బీసీ..!
ABN , Publish Date - Nov 21 , 2026 | 02:53 AM
తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్త జడ్పీ చైర్‌పర్సన్ అయ్యారు. మండపేట నియోజకవర్గం రాయవరం జడ్పీటీసీ కాదా పద్మను అనూహ్యంగా ఈ పదవి వరించింది.
సాధారణ కార్యకర్తకు ‘తూర్పు’ జడ్పీ పీఠం
తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్త జడ్పీ చైర్‌పర్సన్ అయ్యారు. మండపేట నియోజకవర్గం రాయవరం జడ్పీటీసీ కాదా పద్మను అనూహ్యంగా ఈ పదవి వరించింది. టీడీపీ కార్యకర్త అయిన ఈమె 2006లో రాయవరం మండలంలోని మారుమూల గ్రామం కురకాళ్లపల్లి సర్పంచ్‌గా గెలుపొంది సేవలందించారు. సుమారు 20 ఏళ్ల తర్వాత జడ్పీటీసీ ఎన్నికల్లో రాయవరం నుంచి విజయం సాధించారు. జడ్పీ చైర్‌పర్సన్ రేసులో ఆమె పేరే వినిపించలేదు.
ఈ పదవిని జనరల్‌కు కేటాయించడంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే గురువారం రాత్రి అధిష్ఠానం శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పద్మను జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసింది. ఆమె భర్త కాదా ప్రభాకరరావు 2001 నుంచి 2006 వరకు రాయవరం జడ్పీటీసీగా పనిచేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కల్లుగీత కార్మిక కార్పొరేషన్ డైరెక్టర్‌గా అవకాశం కల్పించింది. బీసీలకు టీడీపీ పెద్దపీట వేస్తుందని పద్మను చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడం ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మరోసారి నిరూపించారని ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. పద్మ పదో తరగతి వరకు చదువుకున్నారు. ఈమెకు, ప్రభాకరరావుకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి