Share News

జేఎస్‌డబ్ల్యూకు లక్ష్మకపల్లె ఐరన్‌ఓర్‌ లీజు

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:21 AM

ప్రకాశం- మార్కాపురం జిల్లాల పరిధిలోని లక్ష్మకపల్లెలోని దక్షిణ ప్రాంత ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌ మైనింగ్‌ లీజు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌కు కేటాయించారు.

జేఎస్‌డబ్ల్యూకు లక్ష్మకపల్లె ఐరన్‌ఓర్‌ లీజు

ప్రకాశం- మార్కాపురం జిల్లాల పరిధిలోని లక్ష్మకపల్లెలోని దక్షిణ ప్రాంత ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌ మైనింగ్‌ లీజు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌కు కేటాయించారు. ఈమేరకు గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి ఏప్రిల్‌లోనే జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి లీజు కేటాయిస్తూ గనుల శాఖ మెమో జారీ చేసింది. మైనింగ్‌ లీజులు ఇచ్చే సమయంలో లక్ష్మకపల్లె దక్షిణ ఐరన్‌ బ్లాక్‌లో కొంత భాగం ప్రకాశం జిల్లాలోని పెదచె ర్లోపల్లి మండలంలో, మరికొంత నెల్లూరు జిల్లాలోని వోలేటివారిపాలెం మండలంలో ఉంది.

అయితే, జిల్లాల పునర్విభజన అనంతరం సరిహద్దుల సమస్యలు వచ్చాయి. ప్రకాశంలో ఉన్న పెదచెర్లోపల్లి మండలం విభజన తర్వాత మార్కాపురం జిల్లాలో కలిసింది. నెల్లూరు జిల్లాల్లో ఉన్న వోలేటివారిపాలెం మండలం విభజన తర్వాత ప్రకాశం జిల్లాల్లో కలిసింది. ఇప్పుడు ఈ ప్రాంతాలను నోటిఫై చేస్తూ, మొత్తం రెండు జిల్లాల పరిధిలోని రెండు మండలాల్లో ఉన్న 1825 హెక్టార్ల మైనింగ్‌ ఏరియాను జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌కు కేటాయిస్తున్నట్లుగా గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 06:21 AM