Share News

టీమ్‌ సీబీఎన్‌కు కంగ్రాట్స్‌!

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:47 AM

పుర పోరులో టీడీపీ విజయంపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చిత్రంగా స్పందించారు. ‘టీమ్‌ సీబీఎన్‌కు కంగ్రాట్స్‌’ అంటూ... పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికీ అభినందనలు తెలిపారు.

టీమ్‌ సీబీఎన్‌కు కంగ్రాట్స్‌!

  • జగన్‌ పుల్లవిరుపు ట్వీట్‌

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పుర పోరులో టీడీపీ విజయంపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చిత్రంగా స్పందించారు. ‘టీమ్‌ సీబీఎన్‌కు కంగ్రాట్స్‌’ అంటూ... పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికీ అభినందనలు తెలిపారు. ‘‘ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం లేకుండా చేసి ఎన్నికల్లో ఎలా ఘనవిజయం సాధించాలో మీరు నిరూపించారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, కౌంటింగ్‌ ప్రక్రియలను హైజాక్‌ చేశారు. పోలింగ్‌లో రిగ్గింగ్‌. ఆ అభ్యర్థులు ప్రజలు ఎన్నుకున్నవారు కాదు. మీరు ఎంపిక చేసిన వారు’’ అని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎన్నికల సంస్కరణలు ఇప్పుడు అత్యవసరమని జగన్‌ అభిప్రాయపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 01:47 AM