స్థానిక ఎన్నికల్లో పార్టీ క్యాడర్ గట్టిగా పోరాడింది: జగన్
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:42 AM
స్థానిక ఎన్నికల్లో పార్టీ క్యాడర్ గట్టిగా పోరాడిందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో పార్టీ క్యాడర్ గట్టిగా పోరాడిందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పలు జిల్లాల వైసీపీ నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ‘2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ శాతం పెరిగింది. ఎన్నికలు సజావుగా జరిగితే భారీ ఓటింగ్ వచ్చేది. వైసీపీ గెలిచిన చోట ఫలితాలు తారుమారు చేశారు. దుర్మార్గాలు చేసి చంద్రబాబు నీతులు చెప్పడం విడ్డూరం’ అని జగన్ విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు