Share News

స్థానిక ఎన్నికలు జరుగుతాయో..లేదో?!

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:28 AM

స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సందేహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నాయకులు గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక, వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో తన పాదయాత్ర ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో జగన్‌ సమావేశమయ్యారు.

స్థానిక ఎన్నికలు జరుగుతాయో..లేదో?!

  • జగన్‌ సందేహం.. గట్టిగా పోరాడాలనివైసీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు

  • వచ్చే సెప్టెంబరు-అక్టోబరులో పాదయాత్ర

అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సందేహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నాయకులు గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక, వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో తన పాదయాత్ర ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలన.. రెండున్నరేళ్ల కూటమి పాలపై ప్రతి ఇంట్లోనూ బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. ‘తల్లికి వందనం’ కింద ప్రతి పిల్లాడికీ రూ.15,000 ఇస్తామన్నారని.. ఇప్పుడు ఎంతిస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారని.. రూ.18,750 ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. కుట్ర రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో స్థానికసంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ను కోర్టు రద్దు చేస్తే.. ఆ సాకుతో ఎన్నికలను వాయిదా వేస్తారని విమర్శించారు. సర్‌లో భాగంగా 44 లక్షల ఓట్లు గల్లంతైన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా? అని సందేహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ నేతలు గట్టిగా నిలబడాలని సూచించారు. ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉండాలని నియోజకవర్గ సమన్వయకర్తలను ఆదేశించారు. వైసీపీ పాలనలో చేసిన మంచిని గుర్తు చేస్తూ ప్రజలను ఓట్లు అడగాలన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 05:29 AM