హేరామ్.. సేవ్ ఆంధ్ర, సేవ్ డెమోక్రసీ!
ABN , Publish Date - Nov 06 , 2026 | 07:01 AM
‘హేరామ్.. సేవ్ ఆంధ్ర, సేవ్ డెమోక్రసీ’ అంటూ బాపూజీ తరహా పలుకులు వైసీపీ అధ్యక్షుడు జగన్ నోట మరోసారి వెలువడ్డాయి.
జగన్ నోట మరోసారి బాపూజీ తరహా పలుకులు
ఎన్నికలను చంద్రబాబు కబ్జా చేశారు
ఎస్‌ఈసీ, పోలీసులు, టీడీపీ కుమ్మక్కు: జగన్
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘హేరామ్.. సేవ్ ఆంధ్ర, సేవ్ డెమోక్రసీ’ అంటూ బాపూజీ తరహా పలుకులు వైసీపీ అధ్యక్షుడు జగన్ నోట మరోసారి వెలువడ్డాయి. తన పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం ‘సేఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఉంటే.. నేడు చంద్రబాబు పాలనలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’గా మారిందని వ్యాఖ్యానించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఎప్పటిలానే ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడారు. తన పాలనలో ప్రజాస్వామ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, 85 శాతం స్ట్రయిక్ రేటు సాధించామని జగన్ కితాబిచ్చుకున్నారు.
తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు దౌర్జన్యాలు చేశారంటూ ఆరోపించారు. ఎలక్షన్ల కంటే సెలక్షన్లుగా మార్చేస్తూ మొత్తం ప్రక్రియను కబ్జా చేశారని ఆరోపించారు. పోలింగ్ స్టేషన్ల నుంచి వైసీపీ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపించడాన్ని నిరసిస్తూ రిటర్నింగ్ ఆఫీసర్‌కు వినతి పత్రం అందించేందుకు ధర్నా చేశానని అన్నారు. వినతి పత్రం అందించేందుకు వెళితే పోలీసులు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఎస్‌ఈసీ, పోలీసులు, రిటర్నింగ్ అధికారులు, టీడీపీ కుమ్మక్కయ్యాక జరిగే వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలంటారా అని ప్రశ్నించారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ