30న జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగం
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:46 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంగా ఈ నెల 30న జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
సూళ్లూరుపేట, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంగా ఈ నెల 30న జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఈ నెల 30వ తేదీ రాత్రి 11.55 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల