అత్తోటలో రైతు బాపారావు వినూత్న ఆవిష్కరణ
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:34 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఏ ఆటంకం కలగకూడదని, పెట్టుబడులు రావాలనే ఆకాంక్షతో గుంటూరు జిల్లా అత్తోట రైతు యర్రు బాపారావు వినూత్న రీతిలో వరి సాగు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఏ ఆటంకం కలగకూడదని, పెట్టుబడులు రావాలనే ఆకాంక్షతో గుంటూరు జిల్లా అత్తోట రైతు యర్రు బాపారావు వినూత్న రీతిలో వరి సాగు చేశారు. తన వ్యవసాయ క్షేత్రంలో ‘మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి’ అంటూ పైరుతో అక్షరాలను తీర్చిదిద్దిన తీరు అబ్బురపరుస్తోంది. వరిని అక్షర రూపంలో సాగు చేసేందుకు బాపారావుకు కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు మహర్షి, మనోజ్, వెంకటేష్ తదితరులు సహకరించారు.
- ఆంధ్రజ్యోతి, తెనాలి
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’