రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ABN , Publish Date - Jun 20 , 2026 | 09:55 PM
రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 20: రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ అత్యవసర 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
నైరుతి రుతుపవనాల ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ప్రజలు, స్థానిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే రాగల రెండు రోజుల పాటు అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తా కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
సముద్రం తీవ్ర అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున, ఈ నెల 25వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. తీర ప్రాంత ప్రజలు స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని కోరింది.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!
ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు