ఎర్రగుంట్ల విద్యార్థికి 2 కోట్ల ప్యాకేజీ
ABN , Publish Date - Nov 15 , 2026 | 03:37 AM
కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన విద్యార్థి జాక్‌పాట్ కొట్టాడు. శ్రీలక్ష్మీ ట్రాన్స్‌పోర్టు యజమాని రమణారెడ్డి, తులసి దంపతుల కుమారుడు...
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఐఎంసీ ట్రేడింగ్ కంపెనీకి ఎంపిక
ముద్దనూరు(ఎర్రగుంట్ల) నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన విద్యార్థి జాక్‌పాట్ కొట్టాడు. శ్రీలక్ష్మీ ట్రాన్స్‌పోర్టు యజమాని రమణారెడ్డి, తులసి దంపతుల కుమారుడు నిమ్మకాయల ధర్మతేజారెడ్డి రెండు రోజుల క్రితం ముంబైలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యారు. చెన్నై ఐఐటీలో బీటెక్ (సీఎస్‌ఈ) 4వ సంవత్సరం చదువుతున్న అతడిని ఐఎంసీ ట్రేడింగ్ కంపెనీ ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది. జేఈఈ అడ్వాన్స్‌లో 81వ ర్యాంకుతో చెన్నై ఐఐటీలో సీటు సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం