Share News

శ్రీశైలంలో భద్రతా సిబ్బంది నిజాయితీ.. భక్తురాలికి చేరిన బంగారు మంగళసూత్రం

ABN , Publish Date - May 13 , 2026 | 12:16 PM

ప్రస్తుత మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. అలాంటిది.. బంగారు వస్తువు దొరికినప్పటికీ దురాశకు పోకుండా నిజాయితీతో ఆ వస్తువును పోగొట్టుకున్న వారికి అప్పగించారు సెక్యూరిటీ సిబ్బంది.

శ్రీశైలంలో భద్రతా సిబ్బంది నిజాయితీ.. భక్తురాలికి చేరిన బంగారు మంగళసూత్రం
Srisailam latest News

నంద్యాల, మే 13: ప్రస్తుత మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. బంగారం కొనడం సామాన్యులకు ఎంతో కష్టంగా మారింది. అలాంటిది.. బంగారు వస్తువు దొరికినప్పటికీ దురాశకు పోకుండా నిజాయితీతో ఆ వస్తువును పోగొట్టుకున్న వారికి అప్పగించారు సెక్యూరిటీ సిబ్బంది. ఈ ఘటన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో చోటు చేసుకుంది.


శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనార్థం వచ్చిన ఓ భక్తురాలు ఆలయ ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమె మెడలోని బంగారు మంగళసూత్రం జారి కింద పడిపోయింది. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి మంగళసూత్రం దొరికింది. వెంటనే ఆ బంగారు గొలుసును ఆలయ సూపరింటెండెంట్ గంజి రవికి అప్పగించారు. దీనిపై సమాచారం అందుకున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CSO) శ్రీనివాసరావు వెంటనే అప్రమత్తమై, ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా ఆ ఆభరణం ఎవరికి సంబంధించిందో గుర్తించి, సదరు భక్తురాలిని సంప్రదించారు. ఆమె వద్ద తగిన ఆధారాలను సేకరించిన అనంతరం, అధికారుల సమక్షంలో ఆ బంగారు మంగళసూత్రాన్ని ఆమెకు క్షేమంగా అందజేశారు. తమ విలువైన ఆభరణం తిరిగి లభించడంతో భక్తురాలు ఆనందభాష్పాలతో అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీగా వ్యవహరించిన సెక్యూరిటీ సిబ్బందిని సిఎస్ఓ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించగా, ఈ విషయం తెలుసుకున్న ఇతర భక్తులు కూడా వారిని కొనియాడారు


ఈ వార్తలు కూడా చదవండి:

అస్సాం సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు, లోకేశ్‌ హాజరు

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

Updated Date - May 13 , 2026 | 01:46 PM