Share News

పీ-4 కార్యక్రమానికి ఐటీసీ, హీరో మోటార్స్‌ చేయూత

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:48 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పీ-4 కార్యక్రమానికి ఐటీసీ, హీరో మోటార్‌ కార్పొరేషన్‌ భాగస్వాములుగా నిలిచాయి.

పీ-4 కార్యక్రమానికి ఐటీసీ, హీరో మోటార్స్‌ చేయూత

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పీ-4 కార్యక్రమానికి ఐటీసీ, హీరో మోటార్‌ కార్పొరేషన్‌ భాగస్వాములుగా నిలిచాయి. రాష్ట్రంలో 28 జిల్లాలకు చెందిన 1,120 మంది ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 2.9 లక్షల చొప్పున స్కాలర్‌షిప్‌ అందించేందుకు హీరో మోటార్స్‌ కార్పొరేషన్‌ రూ.32.48 కోట్లు అందించనుంది. బ్రిజ్‌ మోహన్‌ ముంజాల్‌ స్కాలర్‌ర్‌షిప్‌లను విద్యార్ధులకు అందించేందుకు ఈ నిధులను సమకూర్చనుంది.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామాల్లో 25 వేల బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని, వారి జీవనోపాధి, జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఐటీసీ సంస్థ స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థలను సీఎం చంద్రబాబు అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ సంస్థలు ముందుకొచ్చి ఏపీని ప్రయోగశాలగా మార్చుకోవాలని.. పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేయాలని కోరారు. యాక్సెస్‌ టూ ఇక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ప్రతి కుటుంబం హ్యాపీ, హెల్తీ, వెల్తీగా ఉండాలన్నదే తన తాపత్రయమని సీఎం తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 05:49 AM