నెల్లూరులో రోజంతా వర్షం!
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:48 AM
నెల్లూరు జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాలతో పోలిస్తే గురువారం భారీ వర్షం కురిసింది. నెల్లూరు నగరం సహా కొన్ని ప్రాంతాల్లో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో సగటున 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నెల్లూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళ, బుధవారాలతో పోలిస్తే గురువారం భారీ వర్షం కురిసింది. నెల్లూరు నగరం సహా కొన్ని ప్రాంతాల్లో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలో సగటున 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. ఎండిన చెరువులు వర్షాలతో జలకళను సంతరించుకుంటున్నాయి.
చెరువుల్లోకి నీరు చేరుతుండటంతో రైతాంగం సాగుకు సన్నద్ధమవుతోంది. కోట మండలం గూడలి వద్ద ఉన్న ఎగువ నుంచి వర్షపునీరు వస్తుండటంతో మామిడి కాలువ కళకళలాడుతోంది. గూడలి, దక్షిణ పొలం, తిన్నెలపూడి గ్రామాల మీదుగా వెళ్లే స్వర్ణముఖినదికి జలకళ వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి: