Share News

హజ్‌ యాత్రికులకు నెలాఖరు వరకూ వైద్య పరీక్షలు

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:14 AM

హజ్‌-2027 యాత్రకు ఎంపికైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించే గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

హజ్‌ యాత్రికులకు నెలాఖరు వరకూ వైద్య పరీక్షలు

అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): హజ్‌-2027 యాత్రకు ఎంపికైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించే గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. హజ్‌ యాత్రికులు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకుని, సర్టిఫికెట్‌ పొందాలని మంత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్ష, శారీరక దృఢత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్‌తోపాటు ఆన్‌లైన్‌ చెల్లింపు రసీదును అక్టోబరు 1లోపు హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. వీటిని రాష్ట్ర హజ్‌ కమిటీకి సమర్పించాలన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 04:14 AM