Share News

రాష్ట్ర పండుగగా గురజాడ జయంతి

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:57 AM

మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విజయనగరం డీఆర్వో చందక సత్తిబాబు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారుల తో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర పండుగగా గురజాడ జయంతి

విజయనగరం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విజయనగరం డీఆర్వో చందక సత్తిబాబు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారుల తో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21న నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, విద్యాశాఖలను భాగస్వాములను చేశారు. గురజాడ స్వగృహాన్ని, ఆయన కాంస్య విగ్రహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. గురజాడ గృహాన్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని.. విజయనగరం మహారాజ సంగీత కళాశాల తరపున గురజాడ వారి గేయాలను ఆలపించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 04:57 AM