Share News

కోగంటి కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా సీతారామలక్ష్మణ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం..

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:08 PM

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణ కార్యక్రమంతో పాటూ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు కోగంటి భాను ప్రకాష్, కోగంటి అనూష తదితరులు పాల్గొన్నారు.

కోగంటి కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా సీతారామలక్ష్మణ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన   మహోత్సవం..

బాపట్ల: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణ కార్యక్రమంతో పాటూ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు కోగంటి భాను ప్రకాష్, కోగంటి అనూష దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమాధి కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు.


ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవారి విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. అలాగే జలాధివాసం, శయనాధివాసం, దాన్యాధివాసం, హోమాధి కార్యక్రమాలను వైఖానస పండితులు ఆగమమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహాల వాయు ప్రతిష్ఠ చేశారు. అలాగే స్వామి, అమ్మవార్ల విగ్రహ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కోగంటి వారి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటూ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి, అల్లుడు తోట కూర శ్రీనివాస్, కుమార్తె సంధ్య, జొన్నలగడ్డ మోహన బసవపున్నయ్య (బుల్లి బాబు) పాల్గొన్నారు. అలాగే క్రాప వాసులు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని.. స్వామి వారిని దర్శించుకున్నారు.

Updated Date - Feb 26 , 2026 | 03:50 PM