Share News

గొల్లగుప్పలో పలువురికి అస్వస్థత.. మందులు ల్యాబ్‌కు పంపాలని పవన్ ఆదేశం

ABN , Publish Date - Sep 02 , 2026 | 02:23 PM

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలోని గ్రామస్తులందరికీ తక్షణం వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. గ్రామస్తులకు పంపిణీ చేసిన మలేరియా మందుల (క్లోరోక్వీన్)ను ల్యాబ్‌కు పంపాలని సూచించారు.

గొల్లగుప్పలో పలువురికి అస్వస్థత.. మందులు ల్యాబ్‌కు పంపాలని పవన్ ఆదేశం

అమరావతి, సెప్టెంబర్ 02: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలోని గ్రామస్తులందరికీ తక్షణం వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. గ్రామస్తులకు పంపిణీ చేసిన మలేరియా మందుల (క్లోరోక్వీన్)ను ల్యాబ్‌కు పంపాలని సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌కు ఆయన ఫోన్‌ చేసి.. బాలిక (7) మృతి ఘటనపై ఆరా తీశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండో తరగతి చదువుతున్న బాలిక మృతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందంతో పర్యవేక్షణ కొనసాగుతోందని డిప్యూటీ సీఎంకు జిల్లా కలెక్టర్ వివరించారు.


మలేరియా నివారణ కోసం మాత్రలు తీసుకున్న 53 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో తెలంగాణలోని భద్రాచలంతోపాటు లక్ష్మీపురంలో వారంతా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అదేశించిన సంగతి తెలిసిందే.


గొల్లగుప్పలో 74 మందికి మలేరియా నివారణ కోసం క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. వీటి వల్ల పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ట్యాబ్లెట్ వికటించి.. విద్యార్థి జమున (7) మృతి చెందిన సంగతి తెలిసిందే.

Updated Date - Sep 02 , 2026 | 02:41 PM