Share News

సోషల్‌ మీడియాలో జాగ్రత్త!

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:11 AM

గొడ్డలి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫేక్‌ సోషల్‌ మీడియా అకౌంట్లతో కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఎన్‌డీఏ సోషల్‌ మీడియా సమన్వయ కమిటీ తెలిపింది. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు సూచించింది.

సోషల్‌ మీడియాలో జాగ్రత్త!
NDA Alliance In AP

  • కూటమి శ్రేణుల ముసుగులో గొడ్డలి పార్టీ అరాచకం

  • ఫేక్‌ అకౌంట్లతో ఐక్యతను దెబ్బతీసే యత్నాలు

  • తప్పుడు పోస్టులు చూసి ఆవేశపడొద్దు

  • మిత్రపక్షాలను విమర్శించొద్దు.. నేతల దృష్టికి తెండి

  • కార్యకర్తలకు ఎన్‌డీఏ సమన్వయ కమిటీ వినతి

అమరావతి: గొడ్డలి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫేక్‌ సోషల్‌ మీడియా అకౌంట్లతో కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఎన్‌డీఏ సోషల్‌ మీడియా సమన్వయ కమిటీ తెలిపింది. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు సూచించింది. ‘కొందరు గొడ్డలి పార్టీకి చెందినవారు.. కూటమిలోని ఏదో ఒక పార్టీ అభిమానులుగా నటిస్తూ కూటమిలోని మిత్రపక్షాలను విమర్శిస్తూ.. నేతలను దూషిస్తూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.


దీంతో అసలైన కూటమి పార్టీల కార్యకర్తలు ఆవేశానికిలోనై మిత్రపక్షాలపై దాడులకు దిగుతున్నారు. చివరికి మనలో మనమే గొడవపడుతూ వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తున్నాం. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసికట్టుగా వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టి, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో మనలో మనమే విభేదాలు సృష్టించుకోవడం మిత్రధర్మానికి విరుద్ధం. ఈ పరిస్థితికి స్వస్తి పలికేందుకు ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నారు.


ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలెవరైనా మిత్రపక్షాల నేతలు, వారి కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దూ షణలు, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే.. వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించింది. ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.. కూటమి కార్యకర్తల ముసుగులో ఉన్న గొడ్డలి పార్టీ వ్యక్తులను గుర్తించి, వారి కుట్రలను అడ్డుకోవడమేనని స్పష్టం చేసింది. అసలైన కూటమి కార్యకర్తలు సంయమనం పాటించాలని సమన్వయ కమిటీ కోరింది.

Updated Date - Aug 12 , 2026 | 07:16 AM