Share News

ఫిష్ ఆంధ్రా అంటూ డబ్బును డైవర్ట్ చేశారు: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Apr 16 , 2026 | 05:46 PM

ప్రధాని మత్స్య సంపద యోజన కింద అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ఫిష్ ఆంధ్రా అంటూ డబ్బును డైవర్ట్ చేశారు: మంత్రి కొల్లు రవీంద్ర
Kollu Ravindra

అమరావతి: వైఎస్ జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్‌కు తల్లి, చెల్లి, రాష్ట్రం, దేశం పట్ల ఎలాంటి బాధ్యతా భావం, భక్తి లేవని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడానికి రానున్న సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టును కూడా తరిమేస్తానని జగన్ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ ప్రాజెక్టు అవసరమని ఆయన పేర్కొన్నారు.


తీర ప్రాంతంలో తమిళనాడు మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి వచ్చి సమస్యలు సృష్టించడం పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. జగన్ హయాంలో మెరైన్ పోలీసుల గస్తీ బలహీనపడిందని పేర్కొన్నారు. 144 గ్రామాలకు సంబంధించిన గ్రామ కాపుల సమావేశాలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.


విశాఖపట్నం, కాకినాడ, జువ్వలదిన్నెలలో ఫిషింగ్ హార్బర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెట్టీలు నిర్మించామని తెలిపారు. వైఎస్ఆర్ నుంచి జగన్ వరకూ మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. సోంపేట ఘటనలో మత్స్యకారులపై కాల్పులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు.


వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే పరిహారాన్ని రూ.4 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచినట్టు తెలిపారు. మత్స్యకార సంక్షేమం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం సరిగా వినియోగించలేదని, ఫిష్ ఆంధ్రా పేరుతో నిధులు మళ్లించారని ఆరోపించారు. ప్రధాని మత్స్య సంపద యోజన కింద మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర

టీడీపీలో ఎన్నో సంస్కరణలకు లోకేశ్ శ్రీకారం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News

Updated Date - Apr 16 , 2026 | 05:57 PM