Share News

మురసు తుపాను.. డిస్కం సీఎండీలకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 10:09 AM

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని మూడు డిస్కంల సీఎండీలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని వారికి సూచించారు.

మురసు తుపాను.. డిస్కం సీఎండీలకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు
AP Minister Gottipati Ravi kumar

అమరావతి, నవంబర్ 02: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని మూడు డిస్కంల సీఎండీలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని వారికి సూచించారు. రెవెన్యూ, సచివాలయం, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలి వారికి స్పష్టం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలో తుపాను మురసు సన్నద్ధతపై విద్యుత్ శాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మూడు డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రాణ, ఆస్తి నష్టాలు వీలైనంత వరకు తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్‌తోపాటు ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.


తెలంగాణ, తమిళనాడు నుంచి అదనపు సిబ్బందితోపాటు యంత్రాలు రప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. 1912 కాల్ సెంటర్‌ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులపై అధికారులను ఆయన ఆరా తీశారు. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైవాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్యాయత్నం

ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్

For More AP News And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 10:27 AM