డేటా ఆధారిత పాలనను మరింత బలోపేతం చేయాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 24 , 2026 | 04:55 PM
డేటా ఆధారిత పాలనను మరింత బలోపేతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం రాజధాని అమరావతిలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అమరావతి, ఆగస్టు 24: డేటా ఆధారిత పాలనను మరింత బలోపేతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం రాజధాని అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS)పై ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. అలాగే సచివాలయంలో Data Driven Decision Makingపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. Data Lake పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. AI Living Labs, AI Stack అమలుపై సమీక్షించారు.
అలాగే WhatsApp Governance 'మన మిత్ర' సేవలపై చర్చించారు. Aware ప్లాట్‌ఫామ్ పని తీరును కూడా సీఎం చంద్రబాబు సమీక్షించారు. PGRS ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు. ఆస్పత్రుల డేటా విశ్లేషణపై ఆ శాఖ అధికారులతో చర్చించారు. MEPMA సేవల పనితీరుపై సమీక్షించారు. RoR Mutation ప్రక్రియ పురోగతిపై సీఎం ఆరా తీశారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లు, రీ-సర్వే అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. F-Line Survey పురోగతిని కూడా సమీక్షించారు. రేషన్ పంపిణీ డేటా విశ్లేషణపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షకు RTGS, ITE&C, రెవెన్యూ, విద్య, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారుల హాజరయ్యారు.