పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:21 PM
ఆంధ్రప్రదేశ్‌లో పింఛనుదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1న ఉదయం 6:30 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పింఛనుదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 1న ఉదయం 6:30 గంటల నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 61.80 లక్షల మంది పింఛనుదారులకు రూ.2,692.34 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. పింఛన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించనున్నారు. పింఛన్ల పంపిణీ కోసం రూ.2,692.28 కోట్లను పంచాయతీ, వార్డు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. గజపతినగరం మండలంలోని NSAP లబ్ధిదారులకు సంబంధించిన రూ.6 లక్షలను కూడా డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమ చేశారు.
ఇటీవల బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా పింఛన్ల పంపిణీపై సందేహాలు నెలకొన్నప్పటికీ.. సమ్మె విరమించడంతో పంపిణీ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. సెప్టెంబర్ 30న స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బంది బ్యాంకుల నుంచి 100 శాతం నగదును విత్‌డ్రా చేసుకునేలా చర్యలు చేపట్టారు. దీంతో అక్టోబర్ 1 ఉదయం నుంచే లబ్ధిదారులకు నగదు అందించనున్నారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పీడీలు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు సంబంధిత బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ప్రతి నెలా 1వ తేదీన లబ్ధిదారులకు పింఛన్లు సకాలంలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
Also Read:
హెల్త్‌కేర్ సెక్యూరిటీ.. కొత్త తరం ఆర్థిక ప్రణాళిక
ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు రూ.5లక్షల ఫైన్