Share News

గుడ్ న్యూస్.. 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్..

ABN , Publish Date - Jul 10 , 2026 | 09:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గుడ్ న్యూస్.. 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్..
NMC Approved MBBS Seats

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 సీట్ల పెంపునకు ఎన్‌ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌ఓపీ) జారీ చేసింది. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇవాళ (శుక్రవారం) వివరాలు వెల్లడించారు.


తాజా అనుమతులతో ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో 100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి సత్య కుమార్ తెలిపారు. వైద్య విద్యను విస్తరించడంతో పాటు భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే అవకాశం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎన్‌ఎంసీ అనుమతితో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 250కు పెరిగిందని తెలిపారు. అలాగే నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు 175 నుంచి 200కు చేరుకున్నాయని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.


ఏపీలో వైద్య విద్యా మౌలిక వసతుల అభివృద్ధి, అధ్యాపకుల నియామకం, ఆస్పత్రుల్లో అవసరమైన సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతోనే ఎన్‌ఎంసీ నుంచి వరుసగా అనుమతులు లభిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీని జీరో చేసి జగన్ నోరు నొక్కడం ఖాయం: టీడీపీ ఎంపీ

సోషల్ మీడియా దుర్వినియోగంపై కేబినెట్ సీరియస్.. కఠిన చట్టాలకు సీఎం ఆదేశం: మంత్రి పార్థసారథి

Updated Date - Jul 10 , 2026 | 09:56 PM