Share News

నేడు రెండో రోజుకు ఏపీ శాసన మండలి సమావేశాలు..

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:26 AM

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశాలు ఇవాళ (మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సోమవారం జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయాల నివేదికను సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచనున్నారు.

నేడు రెండో రోజుకు ఏపీ శాసన మండలి సమావేశాలు..
Andhra Pradesh Legislative Council

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశాలు నేడు (మంగళవారం) రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. సోమవారం జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయాల నివేదికను సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచనున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖకు సంబంధించిన జీఓఆర్‌టీ నెం.27 నోటిఫికేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సభలో పెట్టనున్నారు.


అలాగే, 1971 ఏపీ ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 2(2) కింద జారీ చేసిన నోటిఫికేషన్‌నూ మంత్రి సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, అసెంబ్లీ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ చట్టాల (మూడో సవరణ) బిల్లు-2026 మండలికి రానుంది. బిల్లును పరిశీలనకు స్వీకరించాలని, ఆమోదించాలని మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రతిపాదించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రెండో రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాల్లో ఏం చర్చించనున్నారంటే..

అసెంబ్లీలోనా? బయటా?!

Updated Date - Aug 18 , 2026 | 08:30 AM