ఏపీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 16 , 2026 | 12:56 PM
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈసారి పరీక్షలో 91.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలో మొత్తం 91.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ http://cets.apsche.ap.gov.in/ICETలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని సూచించారు.
AP ICET 2026 ర్యాంక్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
అధికారిక పోర్టల్ AP ICET http://cets.apsche.ap.gov.in/ICETను సందర్శించాలి.
హోమ్‌పేజీలో కనిపించే డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్‌పై క్లిక్ చేయాలి.
మీ లాగిన్ వివరాలైన రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ లను ఎంటర్ చేయాలి.
సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
మీ ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
దానిని డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోని పెట్టుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం
గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News