Share News

ఏబీఎన్, సీబీఎన్ గురించి వాళ్లకు తెలియదనుకుంటా..: మంత్రి పయ్యావుల కేశవ్

ABN , Publish Date - Apr 10 , 2026 | 06:30 PM

ఏబీఎన్, సీబీఎన్ గురించి వైసీపీ వాళ్లకు సరిగ్గా తెలియదని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాజకీయాల్లో సీబీఎన్ ఎలాగో.. మీడియాలో ఏబీఎన్ అలాగని ఆయన అభివర్ణించారు. మీ తండ్రి వైఎస్ఆర్ సహా కేసీఆర్ సైతం ఏబీఎన్‌ను బెదిరించారని చెప్పారు.

ఏబీఎన్,  సీబీఎన్ గురించి వాళ్లకు తెలియదనుకుంటా..: మంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి, ఏప్రిల్10: ఏబీఎన్, సీబీఎన్ గురించి వైసీపీ వాళ్లకు సరిగ్గా తెలియదని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాజకీయాల్లో సీబీఎన్ ఎలాగో.. మీడియాలో ఏబీఎన్ అలాగని ఆయన అభివర్ణించారు. మీ తండ్రి వైఎస్ఆర్ సహా కేసీఆర్ సైతం ఏబీఎన్‌ను బెదిరించారని చెప్పారు. ఏబీఎన్‌ను నువ్వు కొత్తగా బెదిరించేదేమిటి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పయ్యావుల కేశవ్ చరకలంటించారు. ఏబీఎన్‌ను బెదిరించడం మీ తండ్రి వైఎస్ఆర్‌తోపాటు మీ రాజకీయ గురువు కేసీఆర్ వల్లే కాలేదన్నారు. ఏబీఎన్‌ని బెదిరించడం తప్ప మీరు చేయగలిగిందేమీ లేదని వైఎస్ జగన్‌‌తోపాటు ఆ పార్టీ నేతలకు మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.


రాధాకృష్ణ ఎవరినైనా విమర్శిస్తారు..

శుక్రవారం రాజధాని అమరావతిలో మంత్రి పయ్యావుల కేశవ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కోడికత్తి, గులకరాయి, తండ్రి అనుమానాస్పదంగా చనిపోయినా.. బాబాయి హత్య జరిగినా.. దాని వల్ల లబ్ది పోందింది మీరు అంటూ జగన్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కు ఏమాత్రం నమ్మకం లేదన్నారు. ప్రజల మేలు కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ వార్తలు రాస్తారని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చి.. ప్రజల కోసం నిలబడిన వ్యక్తి ఆయన అని అభివర్ణించారు. తప్పు చేస్తే ఏబీఎన్ రాధాకృష్ణ ఎవరినైనా విమర్శిస్తారని పేర్కొన్నారు.


తమపై ఎన్నో విమర్శలు చేసిన రాధాకృష్ణ..

తమపై ఆయన ఎన్నో విమర్శలు చేశారని ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. విలువలను నమ్మిన వ్యక్తి ఏబీఎన్ రాధాకృష్ణ అని తెలిపారు. ఏబీఎన్‌ని బెదిరించాలనుకుంటే అది మీ పిచ్చితనమే అవుతుందన్నారు. అధికారంలో ఉండగా ఆ చానల్ ప్రసారం కాకుండా చేశావంటూ జగన్‌పై ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇంకా రప్పా రప్పా.. అంటే ప్రజలు కూడా మిమ్మల్ని రప్పా.. రప్పా ఆడిస్తారంటూ పయ్యావుల కేశవ్ వ్యంగ్యంగా అన్నారు.


వైసీపీ మొసలి కన్నీరు..

రాజకీయ అవసరాల కోసమే రాయలసీమను వైసీపీ వాడుకుంటుందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ హయాంలో రాయలసీమకు ఎంత ఖర్చు పెట్టారో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. రాయలసీమ మేలు కోసం వైసీపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమపై పెట్టిన ఖర్చుపై చర్చకు సిద్ధమా? అంటూ ఆ పార్టీ నేతలకు ఆయన సవాల్ విసిరారు.

రాయలసీమలో హార్టికల్చర్‌ హబ్‌ పెడతామని చెప్పాం.. తాము చేస్తామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్‌పై స్టే విధిస్తే.. వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. వివాదాలు సృష్టించేందుకే వైసీపీ-బీఆర్ఎస్ కుట్రలని మండిపడ్డారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే ఏం చేశారంటూ ఆ పార్టీ నేతలను ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ నిలదీశారు. వైసీపీ మొసలి కన్నీరును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.


భయంతోనే బొత్స..

వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడి వ్యాఖ్యల్లో తప్పేముందని వైసీపీ నేతలను మంత్రి పయ్యావుల ప్రశ్నించారు. గతంలో బొత్స చెప్పిన మాటలనే మళ్లీ అచ్చెన్నాయుడు గుర్తు చేశారన్నారు. మీరు చెప్పిన మాటలనే గుర్తు చేస్తే.. ఉలుకెందుకు? అంటూ బొత్సను నిలదీశారు. జగన్‌ నైజం చూసి బొత్స సత్యనారాయణ బాధపడక ఏం చేస్తారు? అంటూ ఎద్దేవా చేశారు.

భయంతో బొత్సకు బాధ కలిగిందేమో? అని వ్యంగ్యంగా అన్నారు. గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు.. తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు.. తల్లి విజయలక్ష్మి నుంచి చెల్లి షర్మిల ఆస్తి తగాదా వరకు.. జగన్‌ నైజమేంటో ప్రజలకు స్పష్టంగా తెలుసునని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

60 అడుగుల బోర్‌వెల్‌లో మూడేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 07:08 PM