రాజ్యసభ ఎంపీలుగా టీడీపీ, జనసేన అభ్యర్థులు ఏకగ్రీవం..
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:35 PM
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడం, నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడం, నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. టీటీపీ నుంచి సానా సతీశ్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పోటీలో నిలవగా.. జనసేన నుంచి లింగమనేని రమేశ్ నామినేషన్ వేశారు. అయితే, పోటీలో నలుగురు అభ్యర్థులే ఉండడంతో వారి ఎన్నిక ఖరారైంది.
ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు జూన్ 1న భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం జూన్ 18న మెుత్తం 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. జూన్, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. అలాగే పదవీకాలం ముగియకుండానే ఖాళీ అయిన మరో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈనెల 9న నామినేషన్ల పరిశీలన.. 11వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
దశాబ్దంగా ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ లేదు: ఈడీ అడ్మిన్‌కు ఉద్యోగ జేఏసీ మెమోరాండం
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం.. వ్యక్తి అరెస్ట్