Share News

క్వాంటం, డీప్‌టెక్, ఏఐ రంగాలకు కేంద్రంగా ఏపీ: ఏపీటీఎస్ ఛైర్మన్

ABN , Publish Date - Jun 19 , 2026 | 09:12 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దూరదృష్టి, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని క్వాంటం, డీప్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు.

క్వాంటం, డీప్‌టెక్, ఏఐ రంగాలకు కేంద్రంగా ఏపీ: ఏపీటీఎస్ ఛైర్మన్

అమరావతి, జూన్19: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దూరదృష్టి, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని క్వాంటం, డీప్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. శుక్రవారం రాజధాని అమరావతిలోని మేధా టవర్స్‌లో రాష్ట్రంలోనే తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను చండీగఢ్ యూనివర్సిటీ ఎండీ జై ఇందర్ సింగ్ సందు, క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్‌తో కలిసి మోహన కృష్ణ ప్రారంభించారు.

Mannava Mohan krishna2.jpg


అనంతరం మోహన కృష్ణ మాట్లాడుతూ.. ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ప్రోత్సాహంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన చండీగఢ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్ర యువతకు సువర్ణావకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్వాంటం ఇంక్యుబేటర్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు ప్రపంచ స్థాయి మెంటారింగ్, అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ వనరులు, పరిశ్రమలతో అనుసంధానం, పెట్టుబడిదారులతో భాగస్వామ్య అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Mannava Mohan krishna8.jpg


క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తు ప్రపంచాన్ని నిర్దేశించే విప్లవాత్మక రంగమని అభివర్ణించారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయిలో రాణించాలని రాష్ట్ర యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రి రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Mannava Mohan krishna7.jpg


అంతకుముందు చండీగఢ్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్(CUBIC)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మయూరి టెక్‌లో మన్నవ మోహన కృష్ణ అవగాహన ఒప్పందం(MOU)పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా క్వాంటం టెక్నాలజీ, పరిశోధన, స్టార్టప్‌ల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఇంక్యుబేషన్ కార్యక్రమాల్లో పరస్పర సహకారానికి మార్గం సుగమం కానుంది. ఈ తాజా ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు సాంకేతిక రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసినట్లయింది.

Mannava Mohan krishna5.jpg


Mannava Mohan krishna3.jpg


Mannava Mohan krishna4.jpg

Updated Date - Jun 19 , 2026 | 09:35 PM