పుడమికి పచ్చ సోయగం
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:23 AM
కనుచూపుమేర పుడమి అంతా పచ్చదనం నింపుకొని పరవశింపజేస్తున్న ఈ దృశ్యం విజయనగరం జిల్లాలోనిది.
కనుచూపుమేర పుడమి అంతా పచ్చదనం నింపుకొని పరవశింపజేస్తున్న ఈ దృశ్యం విజయనగరం జిల్లాలోనిది. రామతీర్థం కొండపై నుంచి చూస్తే కనిపించిన సుందర దృశ్యమిది. భూమంతా పచ్చగా.. అక్కడక్కడ బంగారు వర్ణంతో మెరిసిపోతోంది.
వరి పంటలోని వివిధ దశలను ఈ చిత్రంలో చూడొచ్చు. కోతకు వచ్చిన.. కోతకు వస్తున్న వరి చేలు రంగుమారి బంగారు వర్ణంలో ఉండగా.. ఈనిక, పొట్ట దశలో ఉన్న వరి పచ్చగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర పల్లెల సౌందర్యానికి ఈ చిత్రం దర్పణం పడుతోంది. - ఆంధ్రజ్యోతి, విజయనగరం
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ