Share News

పెరుగుతున్న గోదారి

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:35 AM

అల్పపీడన వర్షాలకు ఉపనది శబరి పరీవాహక ప్రాంతంలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి స్పిల్‌వే నుంచి 2,16,956 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు డీఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు.

పెరుగుతున్న గోదారి

  • నీటమునిగిన గండి పోశమ్మ ఆలయం-రాకపోకలు బంద్‌

  • పోలవరం స్పిల్‌వే నుంచి 2.16 లక్షల క్యూసెక్కులు విడుదల

  • సముద్రంలోకి 1.70 లక్షల క్యూసెక్కులు

పోలవరం/,రాజమహేంద్రవరం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన వర్షాలకు ఉపనది శబరి పరీవాహక ప్రాంతంలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి స్పిల్‌వే నుంచి 2,16,956 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు డీఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద వరద పెరగడంతో గండి పోశమ్మ ఆలయం నీటమునిగింది. దేవదాయ శాఖ అధికారులు ఆలయానికి రాకపోకలు నిలిపివేశారు. పాపికొండలు పర్యటన బోట్ల రాకపోకలను వరద ప్రభావంతో 45 రోజులుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఎగువ నుంచి వరద వస్తుండడంతో ధవళేశ్వరం బ్యారేజీ 4 ఆర్మ్‌లలోని 110 గేట్లను పైకెత్తి 1,70,849 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. సోమవారం ఉదయానికి 2 లక్షల క్యూసెక్కులు రావచ్చని.. తర్వాత వరద క్రమేపీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 03:35 AM