Share News

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:09 AM

గోదావరి పుష్కరాలను ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా నిర్వహిస్తామని దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ చెప్పారు.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు

  • 6 జిల్లాల్లో రూ.120 కోట్లతో పనులు దేవదాయ కమిషనర్‌

నరసాపురం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలను ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా నిర్వహిస్తామని దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ చెప్పారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చేపట్టిన పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరంతో సమానంగా 12 క్షేత్రాల్లో పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

దేవదాయ శాఖ ఆధ్వర్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఆరు జిల్లాల్లో రూ.120 కోట్లతో 520 పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 420 పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. మిగిలిన పనులకు కూడా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలాఖరు నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 05:10 AM