Share News

గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించాలి

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:48 AM

గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. గురువారం పీసీబీ కార్యాలయం నుంచి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి, రాజమండ్రి మున్సిపల్‌ కమిషనర్‌, వివిధ బేవరేజ్‌ సంస్థల ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించాలి

  • ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలి: పీసీబీ చైర్మన్‌ కృష్ణయ్య

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. గురువారం పీసీబీ కార్యాలయం నుంచి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి, రాజమండ్రి మున్సిపల్‌ కమిషనర్‌, వివిధ బేవరేజ్‌ సంస్థల ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలపై చర్చించారు. కుంభమేళా తరహాలో జరిగే గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధ్యాలు పేరుకుపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య సూచించారు.

సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్‌ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని కోరారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఎన్ని అమ్ముడయ్యాయి? ఎన్ని తిరిగి సేకరించారు? ఎంత పరిమాణంలో రీ సైక్లింగ్‌ జరిగిందనే వివరాలు నమోదు చేయాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వినియోగించిన ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో రీ సైక్లింగ్‌ చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని స్పష్టంచేశారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 05:48 AM