కేసు వాపస్ తీసుకోకుంటేన్యూడ్ ఫొటోలు బయటపెడతా
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:53 AM
పోక్సో కేసును వెనక్కు తీసుకోకుంటే బాలిక నగ్న ఫొటోలు బయటపెడతానని ఆమె తల్లిదండ్రులను నిందితుడు బెదిరించడంతో... 14 ఏళ్ల బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ ఘటన జరిగింది.
బాలిక తల్లిదండ్రులకు నిందితుడి బెదిరింపులు
పురుగుల మందుతాగి బాలిక ఆత్మహత్యాయత్నం
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసును వెనక్కు తీసుకోకుంటే బాలిక నగ్న ఫొటోలు బయటపెడతానని ఆమె తల్లిదండ్రులను నిందితుడు బెదిరించడంతో... 14 ఏళ్ల బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ ఘటన జరిగింది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరం గ్రామానికి చెందిన బాలికకు కడియపుసావరం గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడితో పరిచయం ఉంది. బాలికను రాజ్‌కుమార్ కిడ్నాప్ చేశాడని అప్పట్లో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రాజ్‌కుమార్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కొంతకాలంగా బాలిక తాడితోటలోని ఓ షాపులో పనిచేసుకుంటోంది. ఈ క్రమంలో జైలు నుంచి బయటకు వచ్చిన రాజ్‌కుమార్ బాలిక తల్లిదండ్రులను కలిసి.. ‘నాపై పెట్టిన పోక్సో కేసును ఉపసంహరించుకోండి. లేకుంటే నా వద్ద మీ అమ్మాయి న్యూడ్ ఫొటోలు ఉన్నాయి. వాటిని బయటపెడతాను’ అని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక మనస్తాపం చెందింది. శనివారం తాడితోట పనికి వచ్చి పురుగుల మందు తాగిందని పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించినట్టు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం
‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి