Share News

గణపయ్యకు ఆధార్‌, పాన్‌కార్డులు

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:48 AM

వైఎస్సార్‌ కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మదర్‌ థెరిసా వీధి యువత వినాయకుడికి ఆధార్‌, పాన్‌కార్డు థీమ్‌తో ఏర్పాటు చేసిన గణపయ్య మండపం ఆకర్షిస్తోంది.

గణపయ్యకు ఆధార్‌, పాన్‌కార్డులు

వైఎస్సార్‌ కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మదర్‌ థెరిసా వీధి యువత వినాయకుడికి ఆధార్‌, పాన్‌కార్డు థీమ్‌తో ఏర్పాటు చేసిన గణపయ్య మండపం ఆకర్షిస్తోంది. శ్రీ వినాయక, తండ్రి పేరు శివుడు, మదర్‌ థెరిసా వీధి, నాగిరెడ్డిపల్లె, నందలూరు అన్న చిరునామాతో ఆధార్‌, పాన్‌కార్డును ఏర్పాటు చేశారు. జానకి, రవితేజ, జయకుమార్‌రెడ్డి, పవార్‌ నీలకంఠ, మన్సూర్‌, ఫరూక్‌ ఆధ్వర్యంలో ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడి స్వామిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు వస్తున్నారు. గణపయ్య ముందు సెల్పీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

- నందలూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 17 , 2026 | 04:48 AM