జగనే నన్ను మెడపట్టి గెంటేశాడు
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:55 AM
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని నేను వదిలి బయటకు రాలేదు. ఆయనే నన్ను పొమ్మనలేక పొగపెట్టి బయటకు గెంటేశారు’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు.
నేను స్థాపించే పార్టీకి సీఎం అభ్యర్థిని కాదు: విజయసాయిరెడ్డి
అమరావతి, నవంబరు 6(ఆంద్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని నేను వదిలి బయటకు రాలేదు. ఆయనే నన్ను పొమ్మనలేక పొగపెట్టి బయటకు గెంటేశారు’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలో హిందూ ఎస్సీ, ఎస్టీ కులాల పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గణేశ్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేసిన సుమతితో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అప్పట్లో నాకు ఏరోజూ ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లాలన్న ఉద్దేశం లేదు.
నన్ను వైసీపీ నుంచి మెడపెట్టి గెంటేశారు. నేను స్థాపించే పార్టీకి నేను సీఎం అభ్యర్థిని కాదు. కేవలం మెంటార్‌గా మాత్రమే వ్యవహరిస్తా. రాష్ట్రంలో రెడ్డి, కమ్మ నేతలే ముఖ్యమంత్రులు కావాలా? మా పార్టీలో అన్ని కులాలు, మతాలకూ సమన్యాయం ఉంటుంది. యువతకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. 11న కొత్త పార్టీ పేరును ప్రకటిస్తా. విజనరీనని క్లెయిమ్ చేసుకుంటున్న చంద్రబాబు నదీజలాల సామర్థ్యాన్ని మూడింతలు పెంచలేదెందుకు? ఎల్‌నినో ప్రభావంలోనూ సముద్రంలోనికి 4,000 టీఎంసీలను వృధాగా వదిలేశారు.
వాటిని రిజర్వాయర్లకు మళ్లించే ఆలోచన ఎందుకు చేయడం లేదు? అధికార టీడీపీ కొత్తగా తమిళనాడు తరహా రాజకీయాలను అందిపుచ్చుకుంది. ప్రత్యర్థి పార్టీ నేతలపై కేసులు పెట్టే సంస్కృతిని అధికారపక్షం అమలు చేస్తుంది’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు