Share News

మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తాం: సాయిరెడ్డి

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:05 AM

రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉంటామని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడలో..

మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తాం: సాయిరెడ్డి

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉంటామని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడలో ఆయన కొత్త పార్టీని స్థాపించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. తన పార్టీలో అందరూ సమానమేనని, కోటరీలు ఉండవని చెప్పారు.

స్వేచ్ఛగా నిరభ్యంతరంగా ఎవరైనా తనతో సహా ఎవరిపైనైనా వారి అభిప్రాయాలను వెల్లడించవచ్చని అన్నారు. తెలుగుదేశం, వైసీపీ పాలన వల్లే రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. తమ పార్టీ జెన్‌జీకి ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. తమ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. గతంలో పాలించిన జగన్‌, ప్రస్తుత సీఎం చంద్రబాబు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 06:07 AM