మాజీ ఐఏఎస్ అధికారి రోశయ్య కన్నుమూత
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:05 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి డీసీ రోశయ్య(79) బుధవారం మృతి చెందారు.
హైదరాబాద్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి డీసీ రోశయ్య(79) బుధవారం మృతి చెందారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఉన్న ఆయన హైదరాబాద్ సోమాజిగూడలోని స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రోశయ్య గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం సిరిపురంలో 1946 అక్టోబరు 4న జన్మించారు. 1984లో ఆయన ఏపీ రెవెన్యూ సర్వీసెస్లో చేరారు. 1994 నుంచి 1996 వరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పని చేశారు. పదవీ విరమణకు ముందు 2005 నుంచి 2006 వరకు రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. రోశయ్య పెద్ద కుమారుడు కల్యాణ చక్రవర్తి ప్రస్తుతం మధ్యప్రదేశ్లో డీఐజీ హోదాలో పని చేస్తున్నారు. రెండో కుమారుడు కిరణ్కుమార్ ఐటీ రంగంలో స్థిరపడ్డారు. గురువారం ఉదయం 11 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని రోశయ్య సతీమణి రేవతి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్