మాజీ డీపీజీ మృతి.. సంతాపం తెలిపిన సీఎం
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:40 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
హైదరాబాద్, మార్చి 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంతోపాటు శాఖను ప్రజలకు చేరువ చేయడంలో హెచ్.జె.దొర ఎంతో కృషి చేశారని తెలిపారు. దొర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.