Share News

ప్రభుత్వ లాంఛనాలతో బుచ్చి మహేశ్వరరావు అంత్యక్రియలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 04:09 AM

అమలాపురం మాజీ ఎంపీ అయితాబత్తుల జోగేశ్వరవెంకటబుచ్చిమహేశ్వరరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

ప్రభుత్వ లాంఛనాలతో బుచ్చి మహేశ్వరరావు అంత్యక్రియలు
maheswarrao body

ఉప్పలగుప్తం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): అమలాపురం మాజీ ఎంపీ అయితాబత్తుల జోగేశ్వరవెంకటబుచ్చిమహేశ్వరరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గోపవరం గోపవరం నుంచి చల్లపల్లి, సరిపల్లి మీదుగా అల్లవరం మండలం, అమలాపురం టౌన్‌ మీదుగా తొలుత అంతిమ యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. అంతిమయాత్ర అనంతరం గోపవరంలో పార్థివ దేహానికి చివరిసారిగా భార్య జ్ఞానేందిర, కుమార్తెలు, కుమారుడు శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. పలువురు నాయకులు, బంధువులు, స్నేహితుల మధ్య బుచ్చిమహేశ్వరరావు పార్థివ దేహానికి కుమారుడు సతీష్‌ అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో మేఘాలయ సీఎస్‌ పాము సంపత్‌కుమార్‌, మాజీ కేంద్ర మంత్రి ఎం.పళ్ళంరాజు, ముఖ్య నాయకులు ఆకుల వెంకటరమణ, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, సాకా రాంబాబు, అయితాబత్తుల వెంకటకృష్ణారావు, పెమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

నేడు స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు

Updated Date - Oct 20 , 2026 | 04:10 AM