టోర్నీలు ఆడకుండానే నేషనల్స్‌కు?
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:49 AM
జిల్లా, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో పాల్గొనకుండానే కొందరు నేరుగా ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారనే ఆరోపణలు క్రీడావర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చిలకలూరిపేట రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థి నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొనే ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు.
ఫుట్‌బాల్ జాతీయ జట్టు ఎంపికపై ఆరోపణలు
అర్హులైన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
నరసరావుపేట, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లా, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో పాల్గొనకుండానే కొందరు నేరుగా ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారనే ఆరోపణలు క్రీడావర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చిలకలూరిపేట రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థి నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొనే ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఈ విద్యార్థి జిల్లా, రాష్ట్రస్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొనకుండా నేరుగా నేషనల్స్‌కు ఎలా ఎంపికయ్యాడని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. సత్తెనపల్లి మండలం నందిగామలో జిల్లా జట్టు ఎంపిక జరిగింది. ఈ జాబితాలో ఆ విద్యార్థి పేరు లేదు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. అక్కడ ఈ నెల 13న రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు.
ఈ జట్టే జాతీయ స్థాయి పోటీలకు వెళుతుంది. ఈ జాబితాలోనూ సదరు విద్యార్థి పేరు లేదని తెలిసింది. పల్నాడు జిల్లాకు చెందిన ఈ విద్యార్థిని గుంటూరు జిల్లా నుంచి జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల