Share News

వరద ముంపులో పోలింగ్‌ కేంద్రాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:40 AM

కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలోని పలు మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలు సుద్దగడ్డ, ఏలేరు వరద ముంపులో చిక్కుకున్నాయి.

వరద ముంపులో పోలింగ్‌ కేంద్రాలు

గొల్లప్రోలు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలోని పలు మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలు సుద్దగడ్డ, ఏలేరు వరద ముంపులో చిక్కుకున్నాయి. దీంతో ఇక్కడ పోలింగ్‌ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏలేరు, సుద్దగడ్డ వరద ఉధృతితో గొల్లప్రోలు ఈబీసీ కాలనీ, కరణంగారితోట, సూరంపేట కొత్తపేట మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలు, గాంధీనగరంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల చుట్టూ నీరు చేరింది. శుక్రవారం వరకూ వరద నీరు తగ్గలేదు. ఇక్కడే 9 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఇప్పుడు ఇక్కడ పోలింగ్‌ ఎలా నిర్వహించాలనే అంశాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 01:40 AM